ad1
ad1
Card image cap
Tags  

  20-12-2023       RJ

జగనన్న విద్యాదీవెన కింద నిధులు..రూ.41.59 కోట్లు ఫీజులు విడుదల

ఆంధ్రప్రదేశ్

అమరావతి, (డిసెంబర్ 20): జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమానికి, సివిల్స్ పురస్కారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ బుధవారం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మంచి యూనివర్సిటీల్లో సీటు పొందితే ఫీజు ఎంతయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ ఏడాది 51మందికి అడ్మిషన్ ఇస్తున్నారని.. రూ.41.59 కోట్లు ఫీజులు ఇప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం ద్వారా పొందిన ఈ సహయాన్ని మర్చిపోకుండా తిరిగి రాష్ట్రానికి కంట్రిబ్యూట్ చేయాలన్నారు. 408 మందికి నేడు ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు కావాలని యువత కలలు కంటుందని.. దీనికి కూడా మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఎవ్వరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే లక్ష రూపాయలు.. మెయిన్స్క వెళితే లక్షన్నర ఇస్తున్నామన్నారు. 95 మందికి సివిల్స్ ప్రోత్సాహకం ప్రిలిమ్స్ కింద లక్ష రూపాయలు, 11 మంది మెయిన్స్ క్లియర్ చేసిన వారికి లక్షన్నర అందిస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం ఎల్లయ్య, పుల్లయ్య కాలేజీలకు విద్యార్థులను పంపించారన్నారు. అందుకే స్కీములలో మార్పులు చేర్పులు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ క్రమంలో జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్లను.. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమచేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన 95 మందికి లబ్ది చేకూరనుంది.

అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ది పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.

పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువు తున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్ కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు.

అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు, మన తల్లిదండ్రులకు, మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నామని జగన్ అన్నారు.

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ స్లో గానీ, లేదా క్యూఎస్ ర్యాకింగ్స్ గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు చెల్లిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు
సంబంధించిన వారికి రూ. కోటీ 25 లక్షల దాకా, మిగిలిన వారికి రూ. కోటి దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోంది. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నాం.

ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇస్తున్నాం. దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నాం. ఈ పథకం ఎంత సంతృప్తినిస్తుందంటే.. ఇదొక యాస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడాలి. ఎక్కడో ఒక చోట కెరీర్ లో గొప్పగా ఎదిగిన తర్వాత.. ఈ తరహా సాయం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో.. అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలి.

మంచి సీఈవోలుగా పెద్ద పేరు తెచ్చుకుంటే రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకొని మన పిల్లలకు మీరు మంచి చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. ఈ ఫీజులు ఆశ్చర్యకరం అనిపించేలా ఉన్నాయన్నారు. ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షికా ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్న ప్రతి కుటుంబానికీ ఇదొక దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ, సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతోందన్నారు.

మన దేశంలో ఎక్కడైనా ఉత్తీర్ణత సాధించిన వాళ్లు, మన రాష్ట్రంలో ఐఏఎస్ లు కావాలనుకుంటారు. ఇక్కడ కూడా ఒక స్పూర్తినిచ్చే కథలు రావాలని తపన, తాపత్రయంతో, ఆరాటం తో దీనికి సంబంధించి ఈరోజు మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నామని అన్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP