20-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్ 20): క్యాంప్ కార్యాలయం ముసుగులో రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్ట్ సీరియస్ వ్యాఖ్యలు చేసింది. తరలింపును సవాల్ చేస్తూ రైతులు వేసిన పిటీషన్ పై బుధవారం హైకోర్ట్ విచారణ జరిగింది. ఈ పిటీషనన్ ను ముగ్గురు సభ్యుల ధర్మాసనంకు పంపుతామని హైకోర్ట్ చెప్పింది. అక్కడ ఇప్పటికే విచారణ పెండింగ్ లో ఉన్నాయని..
ఈ లోపు పిటీషన్ వేసిన రైతులు ఆందోళనను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని హై కోర్ట్ న్యాయమూర్తి తెలిపారు. రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తామని ధర్మాసనం చెప్పింది. దీంతో తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తదుపరి విచారణను హైకోర్టు గురువారంకి వాయిదా వేసింది.