20-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్ 20): తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. బుధవారం కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం కార్యాలయానికి వచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేలు బ్రిజేందర్ రెడ్డి, నవాజ్ పాషా, బియ్యపు మధుసూదన రెడ్డి వచ్చారు.
అలాగే ఎంపీ మార్గాని భరత్ కూడా సీఎం ఆఫీస్ కు వచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రభుత్వం సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో సజ్జల భేటీ అవుతున్నారు. సజ్జలతో భేటీ అనంతరం సీఎం జగన్ తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యే అవకాశం ఉంది.