21-12-2023 RJ
సినీ స్క్రీన్
ఇటీవల సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అవి సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపాయో తెలిసిందే.. నిందితులు మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టార్గెట్ చేశారు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్ డ్రెస్? డీప్ ఫేక్ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది.. ఆ తర్వాత పలు ప్రముఖ హీరోయిన్ల వీడియోలను కూడా రిలీజ్ చేశారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.. నిందితులను వెంటనే పట్టుకోవాలని అధికారులను ఆదేశించింది..
ఏఐ సాయంతో రష్మిక మందన్న ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై రష్మికతో పాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ సీరియస్ అయ్యారు. రష్మిక తర్వాత అలియా భట్, కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా స్టార్ హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోస్ సైతం వైరలయ్యాయి. అయితే ఈ వీడియోస్ అన్ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాయంతో చేసినట్లు గుర్తించారు. టెక్నాలజీ సాయంతో డీప్ ఫేక్ వీడియోస్ చేయడంపై అమితాబ్ బచ్చన్ సైతం అసహనం వ్యక్తం చేశారు.
ఇలాంటి వీడియోస్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు, ప్రముఖులు డిమాండ్ చేశారు.. రష్మిక డీప్ ఫేక్ వీడియో ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆ నలుగురు ఈ వీడియోను అప్లోడ్ చేసినట్టు గుర్తించారు.. అయితే అసలు కుట్రదారుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..
ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ యానిమల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. అటు లతో బిజీగా ఉంటూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ ల్లో నటిస్తుంది..