21-12-2023 RJ
సినీ స్క్రీన్
విజయ్ హీరోగా వెంకట ప్రభు దర్శకత్వంలో 'దళపతి 68' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభుదేవా, లైలా, స్నేహ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం టైటిల్ విషయంలో కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాత అర్చన కల్పతి స్పందించారు. దళపతి 68'కు సంబంధించిన కొన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాటిల్లో నిజం లేదు. మీరంతా మా సినిమాపై చూపిస్తోన్న అభిమానానికి థ్యాంక్స్. వెంకట ప్రభు ఓ కొత్త కాన్సెప్ట్ వస్తున్నారు. 'బాస్', 'పజిల్' అనే టైటిల్స్ ఈ సినిమాకు సంబంధించినవి కావు. మా సినిమా టైటిల్ ను త్వరలో ప్రకటిస్తాం. అప్పటి వరకూ వెయిట్ చేయండి' అని ట్వీట్ చేశారు ఏజీఎస్ ఎంటర్టైనమెంట్ అధినేత అర్చన కల్పతి. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ చేయనున్నారు.
హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రం తెరకెక్కునున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. ఇక ఇందులో విజయ్ వింటేజ్ లుక్లో కనిపించనున్నట్లు సమాచారం. ఆ కాలంలో తను ఎలా ఉండేవాడో అచ్చంగా అలాగే కనిపించడానికి 'డీ ఏజింగ్ టెక్నాలజీ' వాడుతున్నారని కోలీవుడ్ మీడియా చెబుతోంది.