21-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 21): సనత్ నగర్ నియోజకవర్గంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ అధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు ప్రకటించారు. ఈ మేరకు డాక్టర్ కోట నీలిమ గారిని గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటా నీలిమ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీనీ అధికారంలో తీసుకు వచ్చేందుకు కృషిచేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రతి కార్యకర్త కృషి చేయడం వల్లే నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వివరించారు. అదే స్థాయిలో రెట్టింపు పనిచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. డివిజన్ అధ్యక్షులు.. చిరంజీవి, నరేష్, మల్లికార్జున్, అమనుల్లా ఖాన్, కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందే విధంగా చూసే బాధ్యత మనపై ఉందని అన్నారు. డాక్టర్ కోట నీలిమ గారి ఆధ్వర్యంలో అర్హులకు ప్రభుత్వ పథకంను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ లో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.