ad1
ad1
Card image cap
Tags   Hyderabad

  21-12-2023       RJ

బీఆర్ఎస్ తరఫున ఎంఐఎం వకాలత్ తగదు

తెలంగాణ

హైదరాబాద్, (డిసెంబర్ 21): బీఆర్ఎస్ తరపున ఎంఐఎం నేతలు ఎందుకు వకాలత్ తీసుకుంటున్నారని... వారు ఎవరి తరఫున ఉండాలో నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... 'శ్రీశైలం విద్యుత్ ప్లాంట్లో ప్రమాదంపై ముందే సమాచారం అధికారులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో 9మంది మృతి చెందారు.

ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఫాతిమా మృతి చెందితే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి, విద్యుత్ మంత్రి, మజ్లిస్ నేతలు వెళ్లలేదు. ఫాతిమా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కలిసింది. దేశానికి మైనార్టీ నేతను రాష్ట్రపతి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ మాత్రమే. 12 శాతం రిజర్వషన్లను కల్పిస్తానని బీజేపీ మైనార్టీలను మోసం చేసింది.

మైనార్టీలకు న్యాయం చేసే వాళ్లతో ఉంటారా? లేదా మోసం చేసే వాళ్లతో మజ్లిస్ నేతలు ఉంటారో.. తేల్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్.. అజారుద్దీన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. అక్బరుద్దీన్ ఓడించే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పై వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలి. అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ ను చేశాం. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం అధినేత మాత్రమే. అక్బరుద్దీన్ ను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదు. చాంద్రాయణగుట్టలో హిదువులు కూడా అక్బరుద్దీన్ కు ఓటు వేశారు. మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేదు. విద్యుత్ బిల్లులు ఎగవేతలో సిద్దిపేట మొదటిస్థానంలో ఉంది. గజ్వేల్ రెండో స్థానం, హైదరాబాద్ సౌత్ మూడో స్థానంలో ఉన్నాయి.

సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి ఎన్నికైన వారే గత తొమ్మిదేళ్లలో తెలంగాణను పాలించారు. బిఆర్ఎస్, ఎంఐఎం వేరు కాదు.. ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని పాలించారని అన్నారు. అంతకుముందు అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై సభలో నిర్వహించిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు.

అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ.. దేశ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. పాతబస్తీలో గత ప్రభుత్వ హయాంలో రూ.25 వేల కోట్ల అభివఅద్ధి జరిగింది. ప్రజాప్రతినిధిగా సమస్యలను ప్రస్తావించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరిస్తారో.. లేదో ప్రభుత్వ ఇష్టం అని ఒవైసీ పేర్కొన్నారు. 2014తో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్ లైన్లు, సబ్ స్టేన్లను పెద్ద సంఖ్యలో పెంచారు.

చాలాకాలం వరకు గృహ వినియోగ దారులకు కరెంట్ ఛార్జీలు పెంచలేదు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా భారీగా పెరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెన్కో ఆస్తులు రూ.12 వేల 783 కోట్ల నుంచి రూ. 40 వేల 454 కోట్లకు పెరిగాయి. ప్రతి ఇంటికి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. గృహజ్యోతి భారాన్ని ఇతర వినియోగదారులపై వేయొద్దు. ప్రభుత్వ శాఖల విద్యుత్ బిల్లులు నేరుగా డిస్కంలకు చెల్లించాలి అని అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP