21-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్టణం, (డిసెంబర్ 21): డిమాండ్ల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె గురువారానికి 10వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా జగన్ ఓట్ల కోసం సోది మాటలు చెప్పారంటూ మచిలీపట్నంలో అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే జగన్ ప్రభుత్వం సోది చెబుతుందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు సోదిలో జగన్ రెడ్డిపై వ్యగ్యంగా చెప్పారు. వారు ఏమన్నారంటే.. రాజారెడ్డిని ఒక మూల నుంచి వచ్చాను.. రాజశేఖర్ రెడ్డి వచ్చాను. నా కుమారుడిది పుట్టినరోజు కాబట్టి తిట్టకండి, నా కొడుకు కన్నులు తెరిపిస్తాను. నేను చెప్పిన మాట వినకుంటే కనుగుడ్లు పొడుస్తా. నేను నా కొడుకు కళ్లల్లోకి వెళ్లి కళ్లు తెరిపించి.. మీ న్యాయమైన కోర్కెలను తీర్చేలా చేస్తా. స్పందించకపోతే.. అధికారం నుంచి పడగొట్టేలా నేనే అందరికీ చెబుతా అని అంగన్వాడీలు సెటైర్లు వేశారు.