21-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 21): సభలో శ్వేత పత్రాలు పెట్టి గెలుక్కున్నట్లు ఉందని... తమను గెలికి తిట్టించుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో చిట్ చాట్లో దానం మాట్లాడుతూ.. సభలో ప్రభుత్వం డిఫెన్ స్లో పడిందన్నారు. పథకాలు ఆలస్యంగా అమలు చేయడానికే శ్వేతపత్రం అని మొదలు పెట్టారన్నారు. ప్రభుత్వం అప్పులు బయటపెడితే భవిషత్ ఇబ్బంది అవుతుందన్నారు.
హరీష్ రావు, కేటీఆర్ కు మంత్రుల కౌంటర్ సరిపోవడం లేదన్నారు. ఇరిగేషన్ పై హరీష్ ఉతికి ఆరేస్తరన్నారు. మంత్రులు అసలు విషయాలు చెప్పకుండా పైపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ పరిపాలనలో జాగ్రత్తగా వెళుతున్నారని.. సీఎం పదవి రేవంత్ చిరకాల వాంఛ అని అన్నారు. రేవంత్ .. అంత ఈజీగా వదులుకోరన్నారు. లక్ష్యం పెట్టుకుని.. రేవంత్ సీఎం అయ్యారని తెలిపారు.
రెండేళ్ల క్రితమే కాంగ్రెస్ సీనియర్లు రిటైర్డ్ అవుతరు. నేనే సీఎం అని చెప్పాడు. మా ఎమ్మెల్యేలు కొందరు ఫ్రాస్ట్రషన్ లో మాట్లాడుతున్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అనడం సరికాదు.. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.