21-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 21): దేశంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా..? చెప్పాలని బిఆర్ఎన్ ఎమ్మెల్యే కెటిఆర్ డిమాండ్ చేశారు. ఎక్కడా విజయవంతం అయిన దాఖలాలు లేవని అసెంబ్లీలో విద్యత్ స్వల్పకాలిక చర్చ సందర్భంగా అన్నారు. నేదునూరులో గ్యాస్ అలాకేషన్ అయిందా..? ఆనాడు యూపీఏలో జైపాల్ రెడ్డి షెట్రోలియం శాఖ మంత్రిగా ఉండి, గ్యాస్ అలాకేషన్ చేయలేదు. గ్యాస్ అలాకేషన్ చేయలేదు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. మీ ప్రభుత్వంలో ఇప్పుడు టేకాఫ్ చేయండని డిమాండ్ చేశారు. నేదునూరు, శంకర్ పల్లిలో ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పెడుతామని ప్రభుత్వం హామీ ఇవ్వాలి.
ఇవాళ నోటికొచ్చినట్టు అవమానిస్తున్నారు. అక్కడ అక్బరుద్దీన్ ఒవైసీని, ఇక్కడ మేం మాట్లాడుతుంటే మమ్మల్ని సీఎం అవమానిస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని బీఆర్ఎన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నీళ్లు. బొగ్గు లేని రాయలసీమలో, బొగ్గు లేని విజయవాడలో ధర్మల్ పవర్ కేంద్రాలు నెలకొల్పుతారు. తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వందల మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసనసభలో విద్యుత్ రంగ పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నిర్వాకాన్ని వైట్ పేపర్లో చాలా గొప్పగా స్పష్టంగా చెప్పింది. మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే 2014 నాటికి ఆరు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చామని, అంతటి అసమర్థత, చేతకానితనం మాది అని వారే ఒప్పుకున్నారు అని కేటీఆర్ తెలిపారు. కడపలో రాయలసీమ ధర్మల్ పవర్ కేంద్రం పెట్టారు.
అక్కడ బొగ్గు ఉందా..? నీళ్లు ఉన్నాయా..? విజయవాడలో బొగ్గు ఉందా..? ఇవాళ బాగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వందల మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారు. మానకొండూరు నియోజకవర్గంలోని నేదునూరు, చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్బుతామని భూసేకరణ చేశారు. టీఆర్ఎస్ పార్టీగా అనాడు ఒక్క దగ్గర ధర్నా చేయలేదు. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలేదు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న గ్యాస్ ఆధారిత కేంద్రాలు ఎందుకు పెట్టడం లేదు అని నిరసన వ్యక్తం చేశాం. బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రం ఎందుకు పెడుతారు.. బొగ్గు, నీళ్లు లేని రాయలసీమలో ఎందుకు పెడుతారు..? అని నాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ బిడ్డలుగా గట్టిగా కొట్లాడినం. నిరసనలు వ్యక్తం చేశాం అని కేటీఆర్ స్పష్టం