22-12-2023 RJ
సినీ స్క్రీన్
ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లతో మరింత హైప్ క్రియేట్ చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామునే షోలు పడ్డాయి. సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు సరైన హిట్ ఈ చిత్రం మీదే నమ్మకం పెట్టుకున్నారు. బ్లాక్బస్టర్ ఆగమనం అంటున్న ప్రభాస్ అభిమానులు.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చించారు. సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్)లో సలార్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ నటన అద్భుతమని, నట విశ్వరూపాన్ని చూపించాడని ట్వీట్స్ చేస్తున్నారు. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమార్ నటన కూడా అదిరిపోయిందని అంటున్నారు.
ప్రశాంత్ టేకింగ్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఫస్టాఫ్ సూపర్ అని, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎసెట్ అని పేర్కొన్నారు. బ్లాక్ బస్టర్ ఈ ఏడాది ముగించారని కామెంట్ చేస్తున్నారు. కొందమంది వీక్షకులు యావరేజ్ సినిమా అని రాసుకొచ్చారు. సినిమా స్పెక్టాక్యూలర్ అని ఓ క్రిటిక్ రాసుకొచ్చారు. సెకెండాఫ్ ఎమోషన్, యాక్షన్ అదరిపోయిందని, ప్రభాస్ మాస్ మానియా చూపించారని అంటున్నారు.
సలార్ ఓటిటికి అప్పుడే బిజినెస్
200కోట్లకు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ 'సలార్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేశారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఆ ఐదు భాషల్లోనూ సినిమా స్టీమ్రింగ్ కానుంది. 'సలార్' థియేటర్లలో విడుదల అయ్యే వరకు ఓటీటీ పార్ట్ నర్ ఎవరు అనేది రివీల్ చేయలేదు.
సిల్వర్ స్క్రీన్ మీద తమ డిజిటల్ పార్ట్ నర్ నెట్ ఫ్లిక్స్ అని అనౌన్స్ చేశారు. సుమారు 200 కోట్లకు అటు ఇటుగా డీల్ జరిగిందని టాక్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు ఈ సినిమా ఓటీటీలో వస్తుందనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.