22-12-2023 RJ
సినీ స్క్రీన్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ధనుష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న మూవీ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ నుంచి లాంఛ్ ఫస్ట్ సింగిల్ కిల్లర్ లో ధనుష్ కెప్టెన్ మిల్లర్ గా ఎర్రటి స్కార్ఫ్ కట్టుకొని చేతిలో తుపాకీతో అగ్రెసివ్ లుక్ లో కనిపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.
థియేటర్లలో ప్రభాస్ మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ ఫీవర్ ధనుష్ అంటూ.. నెట్టింట కెప్టెన్ మిల్లర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. యాక్టింగ్ మాస్టర్ ధనుష్.. కెప్టెన్ మిల్లర్ ఆన్ ది వే అంటూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు నెటిజన్లు, మూవీ లవర్స్. ధనుష్ కామ్రేడ్ అవతార్లో కనిపిస్తూ.. సమరానికి అందరినీ మేల్కొలుపుతున్నట్టుగా ఉన్న కెప్టెన్ మిల్లర్ లుక్ ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది.
ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్ఫూర్తితో వస్తోన్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మరో కీ రోల్ లో నటిస్తున్నాడు.
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది. పొంగళ్ కానుకగా జనవరి 2024లో రిలీజ్ కానుంది.