ad1
ad1
Card image cap
Tags  

  23-12-2023       RJ

ప్రేమతత్వమే ఏసు మార్గం

ఆంధ్రప్రదేశ్

విజయవాడ, (డిసెంబర్ 23): ఏసు క్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ గా జరుపుకుంటారు. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడుగా, దయామయుడుగా ఆయన క్రైస్తవుల ఆరాధనలను అందుకుంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కైవస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రీస్తు జన్మించిన రోజు కావడం వల్లే క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ.

దేవుడు కొలువుదీరేది ఆత్మలో అయితే... దానికి మార్గం- క్రీస్తు బోధించిన ప్రేమతత్వం, కరుణ, క్షమ. సంపూర్ణ మానవత్వమే మనిషిని మహాపురుషుడిగా, దైవస్వరూపుడిగా మారుస్తుంది'- ఇదే క్రిస్మస్ పర్వదినం ద్వారా సమస్త మానవాళికి అందే శుభసందేశం. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్ ను జరుపుకుంటారు. రెండు వేల ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత మంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్లు డిసెంబరు 25 తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ కు పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి 'ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావు.

నీకు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలి. అతడు దేవుని కుమారుడు' అని చెప్పాడు. నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన క్రైస్తవ మత మూల పురుషుడు. ఇందులో క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ('ఆభిషిక్తుడు") అనే అర్ధం వచ్చే పదం నుండి పుట్టిన ముకుటం. ఇది హీబ్రూలో 'మెసయ్యా'కు సమానార్ధము కలపదము. రెండువేల సంవత్సరాల క్రితం సంగతి. ఒక అభాగ్యురాలు, సమాజ నిరాపేక్షకు గురైన ఒక స్త్రీ ఆ జనం ఎదుట దోషిగా నిలబడింది. ఆమె చుట్టూ ఉన్నవారి చేతుల్లో రాళ్ళు. పాపం చేసినవారిని రాళ్ళతో కొట్టి చంపడం ఆ దేశంలో ఉన్న దారుణమైన ఆచారం.

ఇంతలో వారి మధ్యలోకి ఒక ఆజానుబాహువు వచ్చాడు. ఆయన ముఖంలో తేజస్సు. రాళ్ళతో కొట్టబోతున్నవారు ఒక్కక్షణం ఆగారు. 'మీలో పాపం చేయనివారెవరు? పాపం చేయని వారు ఎవరైనా ఉంటే, ముందుగా వారే రాయి విసరండి' అన్నాడాయన. అంతా ఒక్కసారి వెనుతిరిగారు. వారి చేతుల్లోని రాళ్ళు కింద పడ్డాయి. ఆమె చేతులు జోడించి ఆయన ముందు మోకరిల్లింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పాపం చేసినవారికి శిక్ష విధించడం కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపంలేని మనిషి పాపరహితుడై యేసుక్రీస్తులా మారతాడని దేవుని నమ్మకం.

అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును ఈలోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాపపరిహారార్థం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళి బాలయేసును దర్శించిన ముగ్గురు జ్ఞానులు పరమానంద భరితులయ్యారు. ఆ సంతోషానికి గుర్తుగా వారు బాలయేసుకు మూడు కానుకలను సమర్పించారు. అవి బంగారము, బోళం, పరిమళ సాంబ్రాణి. వారు సమర్పించిన బంగారం క్రీస్తు ప్రభువు పరిశుద్ధతకు, పవిత్రతకు చిహ్నంగా కనబడుతుంది. బోళం సమర్పణకు సూచన.

తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమతో సమర్పించిన రీతిలో అందరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం, ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్ పర్వదినం ప్రాముఖ్యం. ఇక ఆనాడు జ్ఞానులు కానుకగా సమర్పించిన పరిమళ సాంబ్రాణిని ఆరాధనకు సూచనగా లేఖనాలు పేర్కొంటాయి. అహంకారంతో అవమానం, వినయ విధేయతలతో జ్ఞానం కలుగుతాయి.

నీ కన్నతండ్రి హితోపదేశం విను, నీ తల్లి వృద్ధాప్యంలో ఉంటే ఆమెను నిర్లక్ష్యం చేయకు- ఇవి క్రీస్తు పలికిన అమృత వాక్కులు. తప్పిపోయిన గొర్రె వంటి అమాయక ప్రజలను వెదికి రక్షించేందుకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభువుగా ఆయనను కీర్తిస్తారు. ఇందుకు సాదృశ్యంగా ఆయన జన్మించినప్పుడు ఆ శు భవర్తమానం అమాయకులైన గొర్రెల కాపరులకే ముందుగా తెలియడం ఆశ్చర్యానుభూతి కలిగించే విషయం.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP