23-12-2023 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ దంపతులు మరో అరుదైన ఘనత సాధించారు. తాజాగా వీరిద్దరూ ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. అయితే ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించలేదు. మొదటిసారి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు రామ్ చరణ్ దంపతులు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్? మీడియాలో వైరల్ గా మారాయి.
ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ ఫొటో షూట్ జరుగగా.. సూపర్ కపుల్ అంటూ కవర్ పేజీపై క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలో పింక్ కలర్ డిజైనర్ డ్రెసుల్లో చరణ్, ఉపాసన ఎంతో అందంగా కనిపిస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసనల లవ్ స్టోరీ, వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు. క్లీంకార వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ మెగా జంట.