23-12-2023 RJ
సినీ స్క్రీన్
'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా అవతరించిన అగ్రహీరో ఎన్టీఆర్ మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. ఆసియాలో 2023 టాప్ 50లో నిలిచిన నటుల జాబితాను 'ఏషియన్ వీక్లీ' ప్రకటించింది. అందులో 25వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో షారుక్ ఖాన్ ప్రథమ స్థానంలో నిలవగా, పలువురు బాలీవుడ్ నటులు కూడా ఇందులో చోటు దక్కించుకున్నారు. అయితే, తెలుగు సినిమా నుంచి ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక నటుడు ఎన్టీఆర్ మాత్రమే. 'ఈస్టర్న్ ఐ 2023' పేరిట ఈ జాబితాను విడుదల చేశారు.
దీనితోపాటుగా అమెరికన్ మ్యాగజైన్ 'వెరైటీ' ఇటీవల ప్రకటించిన 500మంది అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో తారక్, రాజమౌళి లకు చోటు దక్కడం విశేషం. ఇక సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం తారక్ 'దేవర’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయిక. సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకునిగా నటిస్తున్నారు. కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ ఫ్రాంచైజ్లో తొలిభాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది.