24-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 24): సనత్ నగర్ నియోజకవర్గంలోని జేక్ కాలనీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కోసం శాశ్వత భవన నిర్మాణానికి స్థల కేటాయింపు చెయ్యాలని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమకి వినతి పత్రం అందజేశారు. సీనియర్ సిటిజన్ సభ్యులు డాక్టర్ కోట నిలిమతో కలిసి స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నిలిమ మాట్లాడుతూ... అసోసియేషన్ సభ్యుల వినతిని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్ నాయకులు మాట్లాడుతూ.. తమ కాలనీలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఎంతో కాలంగా పనిచేస్తుందని తెలిపారు.
తమ సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా రెండు వేల కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయని వాటిని అందరికీ అందుబాటులో ఉంచేందుకు సరైన లైబ్రరీ స్థలం కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో దాదాపు 500 సీనియర్ సిటిజన్స్ ఉన్నారని తెలిపారు. వివిధ వృత్తులు చేసి విశ్రాంతి తీసుకుంటున్న తమకు కాలక్షేపం కోసం అదేవిధంగా కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు చేసేందుకు కాలనీలోనే పిల్లలకు, యువకులకు వివిధ అంశాలపై శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు తమకు ఒక శాశ్వత భవన నిర్మాణం కావాలని విజ్ఞప్తి చేశారు.