ad1
ad1
Card image cap
Tags   Hyderabad

  25-12-2023       RJ

ప్రధాన లక్ష్యం లోక్ సభ ఎన్నికల పైనే: బీఆర్ఎస్

తెలంగాణ

హైదరాబాద్, (డిసెంబర్ 25): లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ నేతలతో సోమవారం కేటీఆర్ సమావేశమయ్యారు. జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జిని, వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. స్వేదపత్రం విడుదలతో పాటు ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు కెటిఆర్, కవిత, హరీష్ రావులు అప్పుడే కాంగ్రెస్ వాగ్దానాలపై నిలదీస్తున్నారు. ఇదే అస్త్రంగా రేపటి ఎన్నికల్లో నిలదీయాలని చూస్తున్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

ఓటమిని విశ్లేషిస్తున్న గులాబీ అధిష్టానం, ఆయా నియోజకవర్గాల నాయకులతో మంతనాలు జరుపుతోంది. ఓడిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటూనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తోంది. దీంతో పార్టీ కీలక నేతలకు ఎంపీ ఎన్నికల విషయంలో దిశా నిర్దేశం చేసే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం పడింది. ఈ ఎంపీ ఎన్నికల్లో పోటీకి సిట్టింగ్, మాజీ ఎంపీలు, మంత్రులు, పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. తొలిసారిగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో చేవెళ్ల నేతలతో సమావేశం అయ్యారు.

లోక్ సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని చేవెళ్ల పార్టీ నేతలకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోని మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్ సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలన్నారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా.. ముందుకు సాగాలని కేటీఆర్ నేతలతో చెప్పారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ నేతలతో సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

లోక్ సభ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ సాగింది. నియోజక వర్గాల వారీగా మీటింగ్ లు ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజక వర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇంచార్జిలుగా ఉంటారు. 2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్లోని నాలుగు నియోజకవర్గాలలో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్ సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలి. బీజేపీ ధీటుగా ఉంటది, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వారు కూడా పోటీ ఇస్తారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా ముందుకు సాగాలని సూచించారు.

చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని ఖారారు చేసినట్లుగా తెలుస్తోంది. తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారని గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశర చేశారని రంజిత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యం. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందన్నారు.

బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడుతాం అని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP