25-12-2023 RJ
తెలంగాణ
రంగారెడ్డి, (డిసెంబర్ 25): మైలరేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ నుంచి డబిరిపురా వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కుక్కను తప్పించ బోయి కారు ప్రమాదానికి గురైంది. కేసు నమోదు చేసి మైలార్ దేవ్ పల్లి పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.