25-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్ 25): ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే సూచనలు కనిపించకపోవడంతో వైసిపి ఎమ్మెల్యే లు టిడిపి పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని రాజకీయ వర్గాలు భావిస్తుండడంతో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు టిడిపిలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2009, 2014లో జ్యోతుల చంటి బాబు జగ్గంపేట నుంచి టిడిపి తరపున పోటీ చేసి ఓటమిని చవిచూశారు. జ్యోతుల నెహ్రూ వైసిపి నుంచి టిడిపిలోకి చేరడంతో చంటి బాబు 2019లో వైసిపిలోకి జంప్ అయ్యాడు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి నంచి చంటి పోటీ చేసి గెలిచారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి ఎంఎల్ఎలకు సీటు గ్యారంటీ లేదని తెలియడంతో సదరు ఎంఎల్ఎలు పార్టీ మారే అవకాశం ఎక్కువగా ఉంది. తాను ఉండాలి లేదంటే తన బంధువు జ్యోతుల నెహ్రూ ఉండాలి కానీ బయటి వారు ఎవరు ఉండకూడదని తన అనుచరులతో చంటి వ్యాఖ్యానించినట్టు సమాచారం. మంచి మూహూర్తం చేసుకొని జనవరి నెలలో చేరుతున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. చంటి బాబు ఆ మధ్యన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీల గాడిద గుడ్డా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల పార్టీలోకి చేరడమేనని, ఏ పార్టీ శాశ్వతం కాదని వ్యాఖ్యనించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.