25-12-2023 RJ
తెలంగాణ
సూర్యాపేట, (డిసెంబర్ 25): గత బీఆర్ఎస్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు హుజూర్ నగర్ లోని చౌకధరల దుకాణాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ...‘మిల్లర్ల దగ్గర ఉన్న లెవీ ధాన్యం స్వాధీనం చేసుకుంటాం.
ప్రతి ఏటా సివిల్ సప్లై శాఖ 3 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బియ్యాన్ని తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సిస్టం ద్వారా అమ్ముతాం. అవసరమైతే ఓపెన్ మార్కెట్ లో బహిరంగ వేలం వేస్తాం. మిల్లర్ల వద్ద ఎలాంటి గ్యారెంటీ లేకుండా 22 వేల కోట్ల ధాన్యం గత ప్రభుత్వం పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.