25-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 25): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదేరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో టీపీసీసీ చర్చలు, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెట్టి సోమవారం సిఎం రేవంతన్ను ఆయన నివాసంలో కలిశారు. ఆయన వెంట ఎన్నారైలు కూడా ఉన్నారు. మర్యాదపూర్వక భేటీ అని తెలుస్తోంది.