25-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 25): రాష్ట్రవ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకొన్నారు. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు కిటకిటలాడాయి. హైదరాబాద్ మియాపూర్‌లోని కల్వరి టెంపుల్ 2023 క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి పాస్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రార్ధనలు చేస్తూ.. యేసుప్రభును స్మరిస్తున్నారు. క్రైస్తవ సోదరులు, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి వచ్చి ప్రార్ధనలు చేసారు.
హైదరాబాదులోని, వివిధ ప్రాంతాల్లో.. నుండి లక్షలాది దైవజనులు ప్రార్ధనల కొరకు వస్తూనే ఉన్నారు మియాపూర్ ప్రాంతం అంతయు ఎక్కడ చూసినా క్రిక్కిరిసిన జనంతో సముద్రంల నిండిపోయింది. ప్రేమను, శాంతిని ప్రబోధించే క్రిస్మస్ పర్వదినాన్ని రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా జరుపుకొన్నారు.