25-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 25): సనత్ నగర్ లోని మెథడిస్ట్ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని చర్చి ఫాదర్ ఆశీర్వదించారు.
అనంతరం కేక్ కట్ చేసి చర్చి పాదర్ లకు తినిపించారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజును గొప్ప వేడుకగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ఆయన అన్నారు. సన్మార్గంలో నడవాలి..తోటి వారి పట్ల ప్రేమాభిమానాలతో మేలగాలనే ఏసుక్రీస్తు సూక్తులను అనుసరణీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో చర్చి పాధర్ జేమ్స్, నతానియల్, దాస్, వసంత్, రాజ్ గోపాల్, బీఆర్ఎస్ డివిజన్ అద్యక్షులు కొలను బాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శేఖర్, మాజీ అద్యక్షులు ఖలీల్, నాయకులు జమీర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.