25-12-2023 RJ
సినీ స్క్రీన్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతి అగ్రనటుడికి సామజిక మాధ్యమాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటమే కాకుండా, వాళ్ళు పెట్టిన పోస్టులు వార్తలుగా కూడా అవుతూ ఉంటాయి. అలాగే తెలుగులో నటులకు వున్నన్ని అభిమాన సంఘాలు, అభిమానులు వేరే భాషా నటులకి లేవు. నటులకు లేకున్నా అభిమానులకు మాత్రం విభేదాలు ఉంటాయి. పక్కహీరోతో పోల్చి విమర్శలు చేస్తుంటారు. కలెక్షన్స్, రికార్డుల వలెనే ఈ అగ్రనటుల మధ్య అంతరాలు వస్తూ ఉంటాయి అని అభిమానులు అనుకుంటూ వుంటారు.
కానీ నిజానికి ఈ నటుల మధ్య ఎటువంటి విభేదాలు వుండవు. ప్రొఫెషనల్ గా వాళ్ళ మధ్య పోటీ ఉండొచ్చు ఏమో గానీ, నటులుగా వాళ్ళందరూ ఒకటే. ఇంతకు ముందు చాలామంది అదే విషయాన్నీ వేదికలమీద కూడా చెప్పారు, కానీ సామజిక మాధ్యమాల్లో మాత్రం అభిమానులు ఇతర నటుల్ని దూషించడం లాంటివి చేస్తూ వుంటారు. అయితే మా మధ్య అలాంటివి లేవని అల్లు అర్జున్ ద్వారా మరోమారు నిరూపించారు.
మహేష్ బాబు తన కుమార్తె సితార పాపతో ఉన్న ఫోటో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకి అల్లు అర్జున్ లైక్ కొట్టారు, ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, మహేష్ బాబు పెట్టిన ఫోటోకి లైక్ కొట్టారు అని సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వస్తోంది. అల్లు అర్జున్ తో పాటు, సమంత, శృతి హాసన్, అడివి శేష్ ఇంకా చాలామంది ఈ ఫోటో కి లైక్ కొట్టారు. అయితే ఇలా ఒక స్టార్ పెట్టిన పోస్టుకి ఇంకో స్టార్ లైక్ కొట్టడం కూడా వైరల్ అవటం, అభిమానులని అలరించటం సంతోషమే కదా!