25-12-2023 RJ
సినీ స్క్రీన్
మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగాలీ భామ పాయల్ ఘోష్. ఆ తర్వాత తారక్ నటించిన ఊసరవెల్లి సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ రోల్ పాయల్ ఘోషు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ అవకాశాలు మాత్రం సో సోగానే వచ్చాయి. బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక గత కొంత కాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది.
అయితే అప్పుడప్పుడు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. నెట్టింట తెగ సందడి చేస్తుంది ఈ భామ. తాజాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీసెంట్గా సలార్ సినిమా చూసిన పాయల్ ఘోష్.. తనకు సలార్ సినిమా నచ్చలేదని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా ఈ ట్రోలింగ్ పై పాయల్ స్పందిస్తూ.. నాకు సలార్ సినిమా నచ్చలేదంటే ప్రభాస్ నచ్చలే అని అర్థం కాదు. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ అభిమానులకు కౌంటర్ ఇచ్చింది. కాగా.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది.