26-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 26): వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజల్లో ఊపు కొనసాగించేలా కాంగ్రెస్ పక్కా ప్లాన్ తో వెళుతోంది. గెలిచిన ఊపును కొనసాగిస్తూనే ఎంపి ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేసే బృహత్తర కార్యక్రమం నిత్యం ప్రజల్లో కొనసాగేలా ప్రణాళికలు రచిస్తోంది. దీనికితోడు కెసిఆర్ పై ఉన్న వ్యతిరేకత ఇప్పటికిప్పుడు చల్లారక పోవచ్చు.
కెటిఆర్ ఎన్ని ప్రజెంటేషన్ లు ఇచ్చినా ప్రజల్లో నమ్మకం కలగదు. దానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ హవా సాగనుంది. ఈ క్రమంలో పా-లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్కు అనుకూలం ఆనే ఉంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు అనేకులను బిఆర్ఎస్ వదులుకుంది. కొందరిని ఇతర పార్టీల నుంచి బలవంతంగా రప్పించుకుంది. అయితే వాడుకుని వదిలేసే రకం అన్న పేరు కెసిఆర్ కు ఉంది.
కెసిఆర్ తో ఉద్యమ సమయంలో ఉన్న నేతలు ఎవరు కూడా ఇప్పుడు లేరు. అలాగే అనేకులు ఎన్నికల ముందు పార్టీని వదిలి వెళ్లారు. అంతే కాదు కొందరు సీనియర్ నేతలను వదులుకున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి, తుమ్మల సహా అనేక మందిని వదులుకున్నారు. వారి వల్ల పది సీట్ల వరకూ కోల్పోయారు. అధికారానికి కూడా దూరం అయ్యారు. ఆ నేతల బలాన్ని ఎందుకు కేసీఆర్ గుర్తించలేకపోయారన్నది అర్థం కాని విషయం. కాంగ్రెస్ తరపున గెలిచి వచ్చిన వారందరికీ టిక్కెట్లు ఇచ్చారు.
సబితా ఇంద్రా రెడ్డి, సుధీర్ రెడ్డి లాంటి వారు తప్ప అందరూ ఓడిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని ప్రజల్లో నిగూఢంగా ఉన్న కోరికను వెలికి తీయడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. ఎలాంటి సెంటిమెంట్ లేకుండా ప్రజల్ని తన వైపు చూసేలా చేసుకోవడం అంత తేలిక కాదు. అందినీ వదులకోవడం, కొందరని దూరం పెట్టడం వల్ల ఉత్పన్నమైన ప్రమాదాన్ని కేసీఆర్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రాధాన్యం మసకబారిపోతుంది. మొత్తంగా కేసీఆర్ చాణక్యం పతనానికి కారణం అయింది.
కేసీఆర్ తనపై అతి విశ్వాసంతో ప్రజలు తాను ఏం చేసినా అంగీకరిస్తారన్న భావనతో వేసిన అడుగులే ఆయనను విజేత స్థానం పరాజితగా నిలిపింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశలన్నీ కుప్పకూలిపోయాయి. ఇప్పుడు సొంత రాష్ట్రంలో పార్లమెంట్ సీట్ల కోసం కిందా మీదా పడాల్సిన వస్తోంది. అధికాంలో కాంగ్రెస్ ఉండడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అంత సునాయాసం కాదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితా ఊపు మరో ఆరు నెలల వరకు ఉంటుంది. ఇకపోతే బీజేపీ తన విజయాన్ని తానే చేజేతుగా పోగొట్టుకుంది. ఇప్పుడు ఎంపి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది.
అయితే మారిన పరిస్థితుల్లో రెండు పార్టీలకుఎంపి సీట్లు గెలవడం అంత సులువు కాదు. బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ చీఫ్ గా తొలగించక ముందు బీజేపీ దూకుడు మీద ఉండేది. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి త్రిముఖ పోరులో అధికారం కోసం పోటీ పడాల్సిన కీలక సమయంలో కాడి వదిలేసినట్లు అయ్యింది. కాంగ్రెస్ అవకాశాన్ని అంది పుచ్చుకుంది. ఇప్పుడు హామీలను చకచకా అమలు చేస్తోంది. ప్రజల్లోకి చొచ్చుకుని వెళుతుంది.
మొత్తంగా 2023 తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి విజేతగా దూసుకుని వచ్చారు. మళ్లీ కొత్త ఏడాది వచ్చేస్తోంది. కొత్త పోటీలు తీసుకు వస్తుంది. మార్చి, ఏప్రిల్లోనే లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. అందులో విజేతలుగా నిలిస్తే.. ఇప్పటి ఫలితాలకు ప్రయోజనం ఉంటుంది. అయితే అప్పటివరకు కాంగ్రెస్ విజయయాత్రను కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.