26-12-2023 RJ
తెలంగాణ
నిజామాబాద్, (డిసెంబర్ 26): తెలంగాణలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది, నాటి సీఎం కెసిఆర్ దే అనే విషయం దేశం మొత్తానికి తెలుసని, తెలియంది కేవలం కాంగ్రెస్ నేతలకు మాత్రమేనని మాజీమంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. భారతదేశ చరిత్రలో రైతులకి నేరుగా డబ్బులు అందించే రైతుబంధు కార్యక్రమంతో మొదలుకొని రైతు బీమా, 24 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తెలంగాణలో అమలు చేసిన ఘనత కెసిఆర్ డే అని అన్నారు. తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందన్న మాటల్లో నిజం లేదన్నారు.
రాష్ట్ర వ్యవసాయ ప్రగతిపైన ఉన్న గుడ్డి వ్యతిరేకతతో కాంగ్రెస్ కక్షకట్టిందని వేముల విమర్శించారు. అయితే విమ్మలు చేసే వారికి విచారణలో నిజాలు తెలుస్తాయని, ప్రజలకు కూడా తెలుస్తుందని అన్నారు. నిధులు మళ్లింపు అంటూ కెసిఆర్ సర్కారుపై అధికార కాంగ్రెస్ దుష్పచారం చేస్తున్నదని ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసినా కెసిఆర్ ప్రభుత్వం అనారు. కాంగ్రెస్ శ్వేతపత్రాల్లో లెక్కలు తప్పని ఇప్పటికే కెటిఆర్ నిరూపించారని అన్నారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పెట్టలేరని అన్నారు.