26-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్ 26): ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో వీటిని ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడిన జగన్... ఈ స్పోర్ట్స్ ఈవెంట్ దేశ చరిత్లోనే మైలురాయిగా చెప్పుకోవచ్చన్నారు. 47 రోజుల పాటు అందరూ పాల్గొనే గొప్ప క్రీడల పండుగ అని అన్నారు. ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడతాయని బీపీ, షుగర్ అదుపులో ఉంటాయని తెలిపారు. అనంతరం ఆడుదాం ఆంధ్రలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కిట్స్ ను పరిశీలించారు. ఈరోజు నుంచి మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒకమైలు రాయిగా నిలబడిపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు.
ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా చిత్రలో నిలబడిపోతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని ప్రయత్నిస్తోందన్నాఉ. ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊర్లోనూ వ్యాయామం, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషి ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయం ఒక అవేర్నెన్ ప్రోగ్రామ్ గా ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరం అని తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్ గా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా కచ్చితంగా వ్యాయమం చేయడం వల్ల బ్లడ్ ప్రజర్ లాంటివి కంట్రోల్ లో ఉంచగలుగుతాం.
డయాబెటిన్ లాంటివి నిరోధించడంలో క్రియాశీలకంగా స్పోర్ట్స్ పని చేస్తుంది. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్మొద దేశం మొత్తం గర్వపడేలా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే వ్యాయామం ఎంతో అవసరం అన్నది కూడా గ్రామస్థాయిలోకి మెసేజ్ తీసుకొనిపోయే గొప్ప కార్యక్రమం ఇదని సిఎం అన్నారు. రకరకాల జబ్బులు కంట్రోల్ లో ఉండాలంటే గ్రామస్థాయిలో వ్యాయామం, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. గ్రామస్థాయి నుంచే ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తున్నామని అన్నారు.
మండలస్థాయి, నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీలన్నీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెతకడం అన్నారు. దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించడం లక్ష్యమని అన్నారు. ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, సాయంగా ఉండేందుకు వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఆణిముత్యాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి టీములు ముందు కొచ్చాయన్నారు. క్రికెట్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు వాళ్లు కూడా ముందుకొచ్చారు.
నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెసనల్ లెవల్లో వీళ్లంతా పార్టిసిపేట్ చేస్తారు. బ్యాడ్మింటనకు సంబంధించి నాతోపాటు ఇక్కడే శ్రీకాంత్ ఉన్నాడు. సింధు కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. వీళ్లకు మన రాష్ట్రంలో ఒకరికి విశాఖలో ల్యాండ్, ఇంకొకరికి తిరుపతిలో ఇచ్చాం. బ్యాడ్మింటన్ అకాడమిస్ కూడా అక్కడ వీళ్లు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంది. వీళ్లు కూడా మెంటార్లుగా మన ట్యాలెంట్ను గుర్తించడంలో, సానపట్టి వజ్రాలుగా మలచడంలో మన పిల్లలందరికీ తోడుగా ఉండేందుకు ముందుకు రావడం సంతోషకరం. వాలీబాల్ కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు రావడం జరిగిందని సిఎం వివరించారు.
కార్యక్రమం ఇక మీదట నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందని సిఎం జగన్ వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులకు నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం కిట్లు ఇస్తూ మన పిల్లల్ని ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.15 వేల సచివాలయాల పరిధిలో, ఇప్పటికే 9 వేల ప్లే గ్రౌండ్లు గుర్తించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను గుర్తించడం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ప్రతి స్కూల్లోనూ ఎంకరేజ్ చేసేలా అడుగులు పడతాయి.
స్కూళ్ల దాకా కిట్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటూ పోతామని అన్నారు. క్రీడా సంబురాలు ఇకపై ప్రతీ ఏడాది జరుగుతాయి. రూ.12కోట్లకుపైగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు. సీఎం జగన్ బ్యాడ్మింటిన్, ప్లేయర్ కిందాంబి శ్రీకాంత్ కలిసి క్రీడా జ్యోతిని వెలిగించారు. సీహెచ్ రమాదేవికి క్రీడల టారన్న అందజేసిన సీఎం జగన్, ఆడుదాం ఆంధ్రలో స్పోర్ట్స్ కిట్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, రోజా, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజినీతోపాటు జిల్లా అధికారులు ఇతర వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో అతి పెద్ద మెగా ట్రోర్నీగా ఆడుదాం ఆంధ్రాను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
ఈ క్రీడలు 15 వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రారంభమయ్యాయి. 9,478 స్టేడియంలలో దాదాపు మూడు లక్షలపైగా జట్లు పోటీ పడనున్నాయి. మంగళవారం ప్రారంభమైన ఈ పోటీలు 47 రోజుల పాటు అంటే ఫ్రిబ్రవరి 10 వరకు జరగనున్నాయి. ఈ పోటీలను వివిధ దశల్లో నిర్వహిస్తారు. తొలి దశలో జనవరి 9 వరకు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పోటీలు జరుగుతాయి. అక్కడ విజయం సాధించిన వాళ్లు తర్వాత దశ పోటీలకు ఎంపిక అవుతారు. వాళ్లు జనవరి పది నుంచి జరిగే మండల స్థాయిలో పోటీ పడతారు. ఆ పోటీలు జనవరి 23 వరకు జరుగుతాయి. అక్కడ విజేతలైన వారంతా నియోజకవర్గ స్థాయి క్రీడల్లో పాల్గొంటారు.
ఈ పోటీలు జనవరి 24 నుంచి 30 వరకు సాగనున్నాయి. తర్వాత దశలో జిల్లా స్థాయిలో క్రీడాకారులు పోటీ పడాల్సి ఉంటుంది. ఈ జిల్లా స్థాయి పోటీలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉంటాయి. చివరిగ్గా నైల్ పోటీలు రాష్ట్రస్థాయిలో జరుగుతాయి. వివిధ జిల్లాల్లో విజయం సాధించిన వారంతా ఇక్కడ పోటీ పడతారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఫిబ్రవరి ఆరు నుంచి 10 వరకు జరగనున్నాయి. రోజూ ఉదయం ఐదు గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 7 గంటల వరకు జరగనున్నాయి.
ఈ పోటీలకు రిఫరీలుగా ఉండేందుకు లక్షా యాభై వేల మంది వాలంటీరులుకు శిక్షణ ఇచ్చారు. 15 ఏళ్ల వయసు దాటిన వారంతా ఈ ఈవెంట్ లో పాల్గొనే ఛాన్స్ ఇచ్చారు. అందుకే కోటీ 22 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 34 లక్షల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఇందులో పది లక్షల మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఐదు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఇందులో క్రికెట్ కు ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈవెంట్ కోసం ప్రభుత్వం 120 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. ఇందులో 12 కోట్ల రూపాయల నగదు బహుమతులు ప్రదానం చేయనున్నారు. 42 కోట్లతో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేయనున్నారు. పాల్గొనే వారందరికీ టీ షర్టులు అందజేయనున్నారు.