26-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 26): పాతబస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్ పురా పీఎస్ పరిధిలోని కిషన్ బాగ్ సోమవారం ఏడాదిన్నర వయసున్న చిన్నారి కిడ్నాప్కు గురైంది. పాపను ఓ మహిళ అపహరించి తీసుకెళ్లుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఆధారంగా 24 గంటల వ్యవధిలోనే పసికందు ఆచూకీని బహదూర్ పురా పోలీసులు కనుగొన్నారు.
ఫిర్యాదు ఇచ్చిన నాలుగు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేశారు. చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. తన కొడుకుకి 8 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో మహిళ.. పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు.