26-12-2023 RJ
తెలంగాణ
కరీంనగర్, (డిసెంబర్ 26): కేరళకు అయ్యప్ప భక్తులు వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. మంగళవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అయ్యప్ప భక్తుల ఇబ్బందులు పాలకులకు కనిపించడం లేదా..? హిందూ క్షేత్రాలను ఎందుకు వివాదం చేస్తున్నారని ప్రశ్నించారు.
సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయి. తబ్లీగీ జమాతను ఇస్లామిక్ దేశాలు నిషేధించాయి. ఆ సంస్థని రాష్ట్రానికి ఎలా అనుమతి ఇస్తారు. కొవిడ్ ను రాష్ట్రానికి తెచ్చిందే తల్లీగీ జమాత్ సంస్థనే. తిరుపతిలో పులులు వస్తే భక్తులకు కర్రలు ఇస్తారా...? తిరుమలకు భక్తులు రాకుండా కుట్రలు చేస్తున్నారు' అని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.