26-12-2023 RJ
తెలంగాణ
సంగారెడ్డి, (డిసెంబర్ 26): జిల్లాలోని ఝరాసంఘం మండలం బద్దిపూర్ గ్రామంలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా పాల్గొన్నారు. ఆశ్రమ పీఠాదిపతి అవధూతగిరి మహారాజ్, వేద పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. దత్తాత్రేయుని శుభాశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. బర్దీపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ఆనవాయితీగా ప్రతిసారి వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.