ad1
ad1
Card image cap
Tags  

  26-12-2023       RJ

కాకినాడకు రానున్న పవన్ కళ్యాణ్.. ఇక్కడే మూడ్రోజులపాటు మకాం

ఆంధ్రప్రదేశ్

కాకినాడ, (డిసెంబర్ 26): జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై దృష్టి సారించబోతున్నారు. కాకినాడలో ఆయన బస చేయబోతున్నారు. 27న కాకినాడ చేరుకోనున్న పవన్ 28,29, 30 తేదీల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. గతంలో వారాహియాత్రను దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో పవన్ పూర్తి చేశారు. అదే సమయంలో.. ఉమ్మడి జిల్లాలో జనసేనకు పొత్తుల్లో భాగంగా ఎక్కువ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది.

ఇప్పటికే వాటిపై ఓ స్పష్టత వచ్చిందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలందర్నీ సమన్వయం చేసుకుని.. కూటమి విజయానికి ఏం చేయాలన్నదానిపై వ్యూహ రచన చేసే అవకాశం ఉంది. గత అనుభవాలు, బలాలను దృష్టిలో పెట్టుకుంటే ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పోటీ చేస్తే క్లీన్ స్వీప్ చేయవచ్చన్న అంచనాలు జనసేన, టీడీపీ వర్గాల్లో ఉన్నాయి. అందుకే జనసేన పార్టీ చేసే స్థానాల్లో బలమైన అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు? టీడీపీ పోటీ చేసే చోట్ల నేతలంతా సమన్వయంతో పని చేసుకుని మంచి ఫలితాలు సాధించేలా అందరికీ దిశానిర్దేశర చేయాలని పవన్ అనుకుంటున్నారు.

తెలుగుదేశం, జనసేన ఇప్పటికే అంతర్గత చర్చలు.. సర్వేల ద్వారా.. ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తే బాగుంటుందో ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో ఎక్కువ చాన్స్ లు ఉన్న చోట్ల పరిస్థితిపై అధ్యయనం చేయడం, నేతలకు కర్తవ్య బోధచేయడం.. చేరికలను ప్రోత్సహించడానికి పవన్ కాకినాడలో మూడు రోజుల పాటు మకాం వేస్తున్నట్లుగా ఉంది. జనసేనానికి రాజకీయం ఇప్పుడు పూర్తిగా వేరని.. ఆ పద్ధతిలోనే రాజకీయం చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

పవన్ పర్యటనలకు వచ్చే వారు ఒక్క శాతం అయితే.. బయటకు రాని వారు.. 90 శాతం ఉంటారని వారందరి చేతా ఓట్లు వేయించుకోవాలంటే.. సమైక్యంగా ఉండాలని అనుకుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావాన్ని తగ్గించడానికి వైసీపీ అధినేత జగన్ చాలా ఎ:- లాన్లు వేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం వంటి వారిని తెరపైకి తెస్తున్నారు. ఈ రాజకీయాలన్నింటినీ పన్న ఎదురుకోవాల్సి ఉంది. అందుకే పవన్ కల్యాణ్.. టీడీపీ, జనసేన పొత్తు వంద శాతం సఫలీకృతమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు రోజుల పర్యటనలో ఉత్తరాంధ్ర నుంచి పలువురు నేతలు జనసేనలో చేరేందుకు కాకినాడ వచ్చే అవకాశం ఉంది.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP