26-12-2023 RJ
సినీ స్క్రీన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప - 2' చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. జాతర నేపథ్యంలో సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నాపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేలా షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తున్నారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేయబోయే చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. జవాన్ తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందట. ఇందులో బన్నీ ఓ కొత్త లుక్లో కనిపించనున్నారని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం ప్రారంభించాలని అట్లీ అనుకుంటున్నారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయనీ.. త్వరలోనే దీనికి సంబంధిత వార్తలు వెల్లడించనున్నారని టాక్ వినిపిస్తోంది. 'పుష్ప 2’ షూటింగ్ పూర్తి కాగానే అట్లీ ప్రాజెక్ట్ప బన్నీ పూర్తి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. 'జవాన్' విజయం సాధించిన సందర్భంగా అల్లు అర్జున్ జవాన్ టీమ్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆ పోస్టు అట్లీని, మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ధ్న ట్యాగ్ చేసి 'నా సినిమాకు కూడా ఇలానే మ్యూజిక్ అందించాలని పేర్కొన్నారు.