ad1
ad1
Card image cap
Tags  

  27-12-2023       RJ

రావమ్మ మహాలక్ష్మీ.. రావమ్మా!

ఆంధ్రప్రదేశ్

విజయవాడ, (డిసెంబర్ 27): ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెన్ హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. నిజానికి ఎపి కాంగ్రెస్ లో సమర్థ నేత లేదా, గట్టి నాయకుడు లేడనే చెప్పాలి. తెలంగాణలో అధికాంలోకి వచ్చాక ఇప్పుడు ఏపీలోనూ అధికారం సాధించడమెలా అన్న చర్చ సాగుతోంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని, ఆమె పిసిసి చీఫ్ అవుతారని ప్రచారం సాగుతోంది. కర్ణాటక, తెలంగాణలో గెలుపు తర్వాత దక్షిణాదిన బలం పెంచు కోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ పైనా ఫోకస్ చేస్తోంది.

ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం సమావేశం ఉద్దేశ్యం కూడా ఇదేనని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అసలు.. ఏపీ రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటన్నది తెలియాల్సి ఉంది. తన అన్న జగన్ కు వ్యతిరేకంగా షర్మిల రాజకీయం చేస్తారా అన్నది చూడాలి. ఆమె అక్కడ జగన్ ను ఢీకొంటారా అన్న చర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భవిష్యత్ ఎంటన్నది ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెన్ కు మద్దతిచ్చి బరి నుంచి తప్పుకున్నారు. అయితే.. అంతకుముందు కాంగ్రెన్ లో వైఎస్ఆర్ సిపీ విలీనంపై పలుమార్లు చర్చలు జరిగినా ఫలించలేదు.

కానీ.. సార్వత్రిక ఎన్నికల వేళ షర్మిల టాపిక్ మరోసారి తెరపైకి వస్తోంది. షర్మిల పొలిటికల్ ఫ్యూచర్ పై.. ఆమె ఏం ఆలోచిస్తున్నారనే అంశాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఇవాళ ఢిల్లీలో జరగనున్న ఏపీ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ చర్చల్లో షర్మిల ఎపిసోడ్పై ఫోకన్ చేసే అవకాశం ఉంది. నిజానికి.. గతంలో కాంగ్రెన్ తో జరిపిన చర్చల సమయంలోనే పార్టీని విలీనం చేసి.. ఏఐసీసీలో కీలక పదవిని షర్మిల ఆశించినట్లు తెలిసింది. దానికి తగ్గట్లుగానే.. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టి షర్మిలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. నిజానికి తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై కాంగ్రెన్ హైకమాండ్ ఫోకన్ పెంచింది. ఏపీలోనూ పుంజుకుని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆ దిశగా పయనించేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతోంది.

ఇప్పటికే.. ఏపీ కాంగ్రెన్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూరు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ లో పార్టీ విజయానికి కృషి చేసిన ఠాకూర్ ఇక్కడా పావులు కదిపే అవకాశం ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ నేతృత్వంలో జరగనున్న ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశంలో.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఏపీలో కాంగ్రెన్ బలోపేతం, ఇండియా కూటమి పొత్తులు, చేరికల అంశాలపైనా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అదేసమయంలో.. వైఎస్ షర్మిల చేరికపై క్లారిటీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల చేరికపై హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని.. ఆమె చేరిక ఏపీ కాంగ్రెన్ కు బూస్టప్ అవుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. అందుకు.. షర్మిల కూడా ఇంటర్నల్ గా కాంగ్రెస్ అధిష్టానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దాంతో.. షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలన్ననిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP