ad1
ad1
Card image cap
Tags  

  27-12-2023       RJ

ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న తెలంగాణ సీఎం రేవంత్

తెలంగాణ

హైదరాబాద్, (డిసెంబర్ 27): తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయ హస్తం కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రుల సమక్షంలో ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు. ప్రజాపాలన లోగోను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీల ప్రొఫార్మాను రూపొందించారు. గురువారం 28వ తేదీ నుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ మొదలుకానుంది. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తోందని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను విడుదల చేసి ప్రజలకు భరోసా ఇచ్చారు. డిసెంబరు 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో ఐదు పథకాలకు మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తాం. ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. జనవరి 7 లోపు లబ్దిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నాం. అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తుంది.

ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారు. ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులందరూ దరఖాస్తులు పెట్టుకోవాలని సూచించారు. ప్రతీ మండలంలో రెండు గ్రూపులుంటాయని.. ఒకటి..ఎండీవో.. మరొకటి ఎమ్మార్వో అని చెప్పారు. గ్రామసభల్లో మహిళలకు, పురుషులకు సపరేట్ కౌంటర్లు ఉంటాయని తెలిపారు. గ్రామసభల్లో దరఖాస్తు పెట్టుకోలేని వాళ్లు తహసీల్దార్, పంచాయితీ ఆఫీసుల్లో దరఖాస్తులు పెట్టుకోవాలని తెలిపారు.

ప్రజావాణిలో వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో ఎక్కువుగా భూ సమస్యలే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నాలుగు పేజీల అభయ హస్తం దరఖాస్తులో వివరాలు ఇలావున్నాయి. దఖాస్తుదారుని పేరు, లింగ నిర్ధారణ, కులం వివరాలు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుని పూర్తి చిరునామా.. ఇంటి నెంబర్, వీధి, గ్రామం, మున్సిపాలిటీ, కార్పొరేషన్, వార్డు నెంబర్, మండలం, జిల్లా వివరాలు నమోదు చేయాలి.

మహాలక్ష్మి పథకం వివరాలు ఉంటాయి. ప్రతినెలా 2 వేల 500 రూపాయల ఆర్థిక సాయం అవసరమా లేదా అనే కాలం ఉంటుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగించుకుంటున్నారు అనే సంఖ్య ఇవ్వాలి. రైతుభరోసా కిందరైతునా.. కౌలు రైతునా అనే వివరాలు ఇవ్వాలి. పట్టాదారు పాసు పుస్తకం నెంబరు ఇవ్వాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు అయిన సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. అదే విధంగా వ్యవసాయ కూలీలకు ఏటా ఇచ్చే 12 వేల రూపాయలకు సంబంధించి ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి.

ఇల్లులేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఉంది. అమరవీరులు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అమరవీరుల పేరు, అమరలైన సంవత్సరం.. ఎఫ్ఎఆర్ నెబర్, డెత్ సర్టిఫికెట్ నెంబర్ నమోదు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అనే వివరాలు ఇవ్వాలి. ఒక వేళ జైలుకు వెళ్లినట్లయితే జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధించిన వివరాలు.. శిక్షా కాలం వివరాలు నమోదు చేయాలి.

గృహ జ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉంటుంది. 100 యూనిట్ల.. 200 యూనిట్ల, 200 యూనిట్లపైన ఉంటుందా అనేది నమోదు చేయాలి. అదే విధంగా కరెంట్ మీటర్ కనెక్షన్ సంఖ్య నమోదు చేయాలి. చేయూత పథకం కింద నెలకు 4 వేలు మరియు దివ్యాంగుల పింఛన్ 6 వేలు పొందేందుకు వివరాలను తెలపాలి. ప్రస్తుతం ఫించన్ పొందుతున్న వారు కొత్తగా దరఖాస్తు నమోదు చేయాల్సిన అవసరం లేదు.

దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్ నెంబర్. ఇతరులు అయితే వృద్యాప్య పింఛన్, వింతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికుల జీవన భృతి, మలేరియా బాధితులు, ఒంటరి మహిళ జీవన భృతి, బీడీ టెకేదార్ జీవన భీతి వివరాలు నమోదు చేయాలి. ఏ పథకం కింద అర్హులో నమోదు చేయాల్సి ఉంటుంది.

రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేయటంపై వస్తున్న విమర్శలపై సిఎం రేవంత్ స్పందించారు. కేసీఆర్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ డిసెంబర్ 20వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు విడదల వారీగా డబ్బులు జమ చేస్తూ వచ్చారని.. ఇప్పుడు ఎందుకు గాయ్ గాయ్ చేస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్ లకు చురకలు అంటించారు. ఇకపోతే తుబంధుకు ఎలాంటి పరిమితి విధించలేదన్నారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP