27-12-2023 RJ
సినీ స్క్రీన్
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషనలో అతడు, ఖలేజా చిత్రాల తర్వాత ముచ్చటగా తెరకెక్కుతున్న మూడవ చిత్రం గుంటూరుకారం. సినిమా మొదలైన దగ్గరి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా పోస్టర్స్ విడుదల చేసి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటైనర్గా వస్తున్నఈ సినిమాను త్రివిక్రమ్ సొంత బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, హైపర్ ఆది, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన రెండో పాట ఏం బాగోలేదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోవడంతో ఈ పాటకు లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్త్రి వంటి వారు సామాజిక మాద్యమం ఎక్స్ కు గుడ్బై చెప్పాల్సి వచ్చింది.
అదేవిధంగా ఈ విషయంలో నిర్మాత చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదానికి దారి తీయగా అఖరుకు మహేశ్ బాబు ఎంట్రీ అయి యూనిట్పై ఆసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ పుల్స్ టాప్ పెడుతూ చిత్ర యూనిట్ రెండు రోజుల క్రితం శ్రీలీలతో కలిసి మహేశ్ మాస్ డ్యాన్స్ పాటకు సంబంధించిన ఫొటో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి వరకు సినిమాపై వస్తున్న నెగిటివిటీని తగ్గించింది.
తాజాగా బుధవారం ఉదయం గుంటూరు కారం సినిమా నుంచి మహేశబాబు స్టైలిష్ లుక్స్ పోస్టర్స్ ని విడుదల చేసి జనవరి 12న వస్తున్నాం అంటూ ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్స్ తో సినిమాపై హైప్ పెంచుతూనే అభిమానుల్లో క్రేజ్ తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అంతేగాక ఈ లుక్స్ విడుదల చేయడం ద్వారా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.