27-12-2023 RJ
సినీ స్క్రీన్
సలార్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. చాలా రోజులుగా ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న విషయంపై కుండబద్దలు కొట్టేశారు. సలార్ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ మూవీ ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ఉగ్రంకు రీమేక్ అన్న టాక్ మొదలైంది. షూటింగ్ సమయంలో ఈ విషయం మీద ఎన్ని వార్తలు వచ్చినా చిత్రయూనిట్ స్పందించలేదు. గత కొద్ది రోజులుగా కొంత మంది రీమేకే అని, మరి కొంత మంది రీమేక్ కాదని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు. నైస్ గా రిలీజ్ కు కొద్ది గంటల ముందు అసలు విషయం రివీల్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
సలార్ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ మూవీ ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ఉగ్రంకు రీమేక్ అన్న టాక్ మొదలైంది. షూటింగ్ సమయంలో ఈ విషయం మీద ఎన్ని వార్తలు వచ్చినా చిత్రయూనిట్ స్పందించలేదు. గత కొద్ది రోజులుగా కొంత మంది రీమేకే అని, మరి కొంత మంది రీమేక్ కాదని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు. ఫైనల్ గా రిలీజ్కు కొద్ది గంటల ముందు అసలు విషయం రివీల్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఎస్... ఉగ్రం కథ, సలార్ కథ ఒకటే అంటూ అసలు విషయం బయట పెట్టారు ప్రశాంత్ నీల్.
కానీ మేకింగ్, టేకింగ్, టెక్నికల్ వాల్యూస్ ఇలా ప్రతీ దాంట్లో ఉగ్రంకు సలార్ కు చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు. జస్ట్ ఆ కథలో సోల్ మాత్రమే తీసుకొని ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ల స్థాయికి తగ్గట్టుగా కొత్త ట్రీట్మెంట్ తో సలార్ ను రూపొందించానని చెప్పారు. ఎన్నో కథలు సిద్ధంగా ఉన్న సలార్కు ఉగ్రం కథనే ఎంచుకోవాడానికి రీజన్ ఏంటో కూడా చెప్పారు ప్రశాంత్ నీల్.
ఉగ్రం ఆయన తొలి సినిమా, అలాగే ఆ సినిమా విషయంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు ప్రశాంత్ నీల్. ఆ సినిమా మేకింగ్ కోసం నాలుగేళ్లు కష్టపడ్డారు. రిలీజ్ విషయంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. రిలీజ్ తరువాత సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. పైరసీ కారణంగా సినిమా అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు. అందుకే మరోసారి ఆ కథ సత్తా ఎంటో చూపించాలన్న ఉద్దేశంతో అదే పాయింట్ తో సలార్ ను రూపొందించానని చెప్పారు.