ad1
ad1
Card image cap
Tags   Cinema Buzz Silver screen

  28-12-2023       RJ

కొరియన్ నటుడు లీ సన్ క్యున్ అనుమానాస్పద మృతి

సినీ స్క్రీన్

ప్రముఖ దక్షిణ కొరియా నటుడు లీ సన్ క్యున్ 48 బుధవారం ఉదయం సియోల్ లోని ఓ పార్క్ వద్ద పార్క్ చేసి ఉన్న కారులో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. అయితే  లీ సన్ క్యున్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో అతని ఇంటి వద్ద రాసి పెట్టి ఉంచిన ఓ సూసైడ్ నోట్ ను గర్తించినట్టు తెలిసింది.

92వ ఆస్కార్ విజేతగా నిలిచిన పారాసైట్ చిత్రంలో పార్క్ డాంగ్ ఇక్ అనే ధనవంతుడి పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న లీ సున్ కున్ అంతకుముందే థ్రిల్లర్ హెల్ప్ లెస్ (2012), రొమాంటిక్ కామెడీ జానర్ లో వచ్చిన అల్ అబౌట్ మై వైఫ్ (2012), క్లైమ్ / బ్లాక్ కామెడీగా వచ్చిన ఎ హార్డ్ డే (2014)లో పోషించిన పాత్రలతో కొరియాలో ఓ అగ్ర నటుడిగా ఎదిగారు. 1975 లో జన్మించిన  లీ సన్ క్యున్ చిన్నచిన్న పాత్రలను కూడా పోషిస్తూ వచ్చి హీరోగా మారి తోటి నటి జియోన్ హై జిన్ను 2009లో పెళ్లి చేసుకున్నాడు.

వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలాఉండగా దక్షిణకొరియాలో డ్రగ్స్ కు సంబంధించిన కేసులను అక్కడి ప్రభుత్వం తీవ్ర నేరంగా పరిగణిస్తుంది. ఇక్కడి దేశీయులు బయట దేశాలలో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకున్నా మళ్లీ తమ దేశానికి వచ్చాక దానిపై సమాధానం ఇచ్చుకోవాలనేంతగా కఠినంగా ఇక్కడి చట్టాలు ఉంటాయి. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నది నిజమే అని తేలితే నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా హీరో  లీ సన్ క్యున్ డ్రగ్స్ తీసుకుంటున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

పలుమార్లు విచారణలకు సైతం హజరై టెస్టులు చేయించుకున్నాడు. అయితే గత అక్టోబర్ సియోల్లోని ఓ బార్ ఉద్యోగితో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు మరోమారు ఆరోపణలు రాగా ప్రస్తుతం ఈ కేసు విషయంలో విచారణ ఎదుర్కుంటున్నారు. దీంతో అదే సమయంలో తను నటిస్తున్న నో వే ఔట్ అనే టీవీ సిరీస్ నుంచి తప్పించడం ఆయన కాస్త మనోవేదనకు గురైనట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో లీ భార్య మూడు రోజుల నుంచి లీ సన్ క్యున్ కనబడడం లేదని, ఇంట్లో ఓ లెటర్ లభించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును పరిశోధిస్తున్న సమయంలోనే ఓ పార్కు వద్ద ఆగి ఉన్న కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల సమగ్ర విచారణ అనంతరం లీ సన్ క్యున్ ని హత్యా లేక ఆత్మహత్యా అనేది తెలుస్తుంది.

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

02, Sep 2024

నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ళ సినీ స్వర్ణోత్సవం

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP