ad1
ad1
Card image cap
Tags   Silver screen

  28-12-2023       RJ

తమిళ సినీరంగంలో విషాదం.. నటుడు విజయకాంత్ మరణం

సినీ స్క్రీన్

చెన్నై, (డిసెంబర్ 28): తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. 71 ఏండ్ల విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు.

చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడే ఆయన మరణించారనే వార్తలు నెట్టింట షికారు చేశాయి. అయితే ఆ వదంతులను ఆయన సతీమణి ప్రేమలత కొట్టిపారేశారు. అయితే రెండు వారాలు గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయకాంత్.. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైతం అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.

విజయకాంత్ మృతి పట్ల తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్ తమిళ సినిమా లెజెండ్. ఆయన నటన లక్షల మంది హృదయాలను తాకింది. రాజకీయ నాయకుడిగా తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపించారు విజయకాంత్. ప్రజా సేవలో ఉంటూ, వారి సమస్యలపై చాలా ఏళ్లుగా పోరాడారు. తమిళనాడు రాజకీయాల్లో ఆయన లేనిలోటు తీరనిదని ప్రధాని మోడీ అన్నారు. నా సోదరుడు విజయకాంత్ మరణవార్త తీవ్ర విషాదాన్ని నింపిందని కమల్ హాసన్ అన్నారు.

తమిళనాడు రాజకీయాల్లో ఆయనది ప్రత్యేకమైన స్థానం. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు ఆయన. తమిళ సినీ, రాజకీయ రంగాల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. విజయకాంత్ గారి మరణ వార్త చాలా బాధాకరం అని సినిమా, రాజకీమ రంగాల్లో ఆయనొక పవర్ హౌస్ అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఒక మంచి నటుడితో పాటు మనసున్న రాజకీయ నాయకుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

02, Sep 2024

నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ళ సినీ స్వర్ణోత్సవం

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP