28-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 28): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలను సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు.. కేపీ హెచ్ బీ సీఐ వెంకట్, ఎయిర్ పోర్ట్ సీఐ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భార్యాభర్తల మధ్య వివాదంలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తిని చితకబాదిన కేసులో సీఐ వెంకట్ ను, ఓ కేసులో సరిగా విచారణ చేయ నందుకు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. కొన్నిరోజుల క్రితం నిజాంపేట్ రోడ్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఉండే ప్రణీత్ అనే యువకుడిని కేపీహెచ్ బీ పోలీసులు ఓ కేసు ఎంక్వైరీ కోసం విచారణకు పిలిచారు.
అయితే పోలీస్ స్టేషన్ లో తనను తీవ్రంగా కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలైన ప్రణీత్ ముందుగా కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని మెరుగైన ట్రీట్ మెంట్ కోసం కొన్నిరోజుల తర్వాత గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. ఈ విషయం సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. ఇవాళ సస్పెండ్ చేశారు.