28-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 28): మొదలయ్యింది. పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ లో 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ప్రజలెవరకూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇది దొరల ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వమని అన్నారు. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని, పథకాలు అందిస్తామనే ప్రభుత్వం తమది కాదని చెప్పారు.
పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదు. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మాది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మేం ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజల సమక్షంలోనే అమలు చేస్తున్నామని వివించారు. ప్రజల వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి వంద కుటుంబాలకు ఓ కౌంటర్ పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు అందిస్తాం. ప్రతి ఊరిలోనూ కౌంటర్ ఉంటుంది.
జనవరి 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారని భట్టి వెల్లడించారు. మనది ప్రజల ప్రభుత్వమని దొరల ప్రభుత్వం కాదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారని, ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మనదన్నారు. తొమ్మిదేళ్లలో ఒక రేషన్ కార్డుకు దరఖాస్తు తీసుకోలేదని, ప్రజాపాలన అందిస్తామని చెప్పి ప్రజలను ఒప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేశామని, తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.
ప్రజలు దగ్గరకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేస్తున్న కార్యక్రమమే ప్రజాపాలన అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ గౌతమ్, తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. అభయహస్తం గ్యారంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు.
మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుందన్నారు. ప్రభుత్వం మీ ముందు వచ్చిందని... మీ దరఖాస్తులు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయించి అధికారం ఇస్తారన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలే అవకాశం ఇచ్చారని దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు.