ad1
ad1
Card image cap
Tags  

  28-12-2023       RJ

ఆంధ్రప్రదేశ్ ను బాగుచేసే ఆలోచన చేయండి

ఆంధ్రప్రదేశ్

బెంగళూరు, (డిసెంబర్ 28): ఆంధ్రప్రదేశ్ ను బాగు చేసేందుకు మీరు ఏం చేయగలరు ప్లాన్ చేయండని కర్నాటకలో తెలుగువారికి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. వచ్చే ఎన్నికలు ఎందుకు ముఖ్యమో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలి. మీరు సంపాదించే దానిలో 5 శాతం ఖర్చుపెట్టి సమాజం కోసం ఖర్చు చేయండి. సమాజహితం కోసం మీరు కష్టపడాలి. నాకోసం కాదు నేను చేసే పనులు తర తరాలు గుర్తుపెట్టుకోవాలి. చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటే నా జన్మ ధన్యమైనట్లేనని చంద్రబాబు పేర్కొన్నారు.

కర్నాటక తెలుగు ప్రజల సన్మాన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. బెంగళూరులో ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ప్రజలు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వేలాది మంది తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ మాట్లాడుతూ.. తనకు కష్టం వచ్చినప్పుడు అంతా అండగా నిలబడ్డారన్నారు.

రైతు బిడ్డ ఐటీలో ఎందుకు పనిచేయకూడదు అని ఆలోచన చేశానని.. ౩౦ సంవత్సరాల క్రితం చేసిన ఆలోచనతో ఈ రోజు ఇంత మంది ఐటీ ఉద్యోగులుగా స్థిరపడ్డారన్నారు. ఐటీని డెవలప్ చేయాలంటే ఆ రోజు ఎగతాళి చేశారన్నారు. థింక్ గ్లోబలీ... యాక్ట్ గ్లోబలీ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నా గ్లోబలీ పనిచేసే అవకాశం ఉందన్నారు. ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే అవకాశం భారత దేశానికే ఉందన్నారు. 2047 సంవత్సరానికి భారత దేశం నెంబర్ వన్ గా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ను కూడా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. నవశఖం తెలుగువారి శఖం అవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే నంబర్ వన్ తెలుగు ప్రజలు ఉండాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. బెంగళూరు టీడీపీ ఫోరంను చాలా పద్ధతిగా ఆర్గనైజ్ చేస్తున్నారన్నారు. ఆడపిల్లకు చదువెందుకు అని అన్నారని... ఇప్పుడు ఆడపిల్లలు మగవారితో సమానంగా ఎదుగుతున్నారన్నారు. ఆడపిల్లకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజంను చూడాలన్నదే తన కోరికన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలనేదే లక్ష్యమని స్పష్టం చేశారు. పీ4 వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని.. పీ4 అంటే పబ్లిక్ ప్రయివేట్ పీపుల్ పార్టనర్ షిప్ అని టీడీపీ చీఫ్ చెప్పుకొచ్చారు. బెంగళూరులో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు కుప్పంకు బయలుదేరి వెళ్లారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP