28-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్ 28): నవరత్నాలు, మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ ..నవరత్నాలు నవమోసాలయ్యాయి అనే పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు గురువారం జాతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు. బటన్ నొక్కుడు మునుగులో బొక్కింది ఎంతో.. ప్రజల నుంచి దోచింది ఎంతో సీఎం జగన్ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ఎ-లాన్ నిధుల్ని కూడా దారిమళ్లించి, ఆయా వర్గాల నోట్లో మట్టికొట్టిన ఘనుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. అమరావతి, పోలవరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రాజెక్టుల్ని నర్వనాశనం చేశారని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ రెడ్డి ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియ చేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చామన్నారు. పాదయాత్ర, ఎన్నికల సమయంలో, వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన మొత్తం హామీలు 730 అని, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చింది కేవలం 109 మాత్రమేనని.. 85 శాతం హామీలు విస్మరించి ప్రజల్ని వంచించడమేనా జగన్ రెడ్డి నీతి.. నిజాయితీ? అంటూ ప్రశ్నించారు. తన మేనిఫెస్టో బైబిల్తో సమానమని చెప్పుకునే జగన్ రెడ్డి.. మేనిఫెస్టోలో చెప్పినవి ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రజల ముందు ఉంచలేదనే జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయన్నారు. టీడీపీ మేనిఫెస్టో తళతళలాడుతున్న అద్దంలా ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో కనిపిస్తుందన్నారు. టీడీపీ మేనిఫెస్టోలోని హామీల్లో చంద్రబాబు 99 శాతం 2014 - 19 మధ్య అమలు చేశారనే వాస్తవం కూడా జగన్ రెడ్డి అతని ప్రభుత్వానికి బోధపడుతుందన్నారు.
జగన్ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అప్పులు, ప్రజల రక్తం పీల్చి వసూలుచేసింది. కలిపి మొత్తం రూ.12 లక్షల కోట్లని, ఆ మొత్తంలో బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకు అందించిన సాయం కేవలం రూ.2.40 లక్షల కోట్లు, మిగిలిన సొమ్ము ఎటుపోయిందో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇనుకను దోచేస్తూ వేలకోట్లు కొల్లగొట్టి, దాదాపు 125కు పైగా వివిధ వృత్తుల వారి కడుపులపై కొట్టారని, జాబ్ క్యాలెండర్, ఏటా డీఎస్సీ అని యువత, నిరుద్యోగుల్ని వంచించారని ఆరోపించారు.
మద్యనిషేధం, సీపీఎన్ రద్దు హామీలతో మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను రోడ్డున పడేశారన్నారు. 4 ఏళ్ల 8 నెలల పాలనలో ప్రజలకు, రాష్ట్రానికి ఇదిగో ఇది చేశానని చెప్పగల ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? అని అచ్చెన్నాయుడు నవాల్ చేశారు.