29-12-2023 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ హీరో రవితేజ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఈగల్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ భాగంగా ఏదో ఒక అప్డేట్ అందిస్తున్నారు టీం మెంబర్స్. ఈగల్ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు.
తాజాగా మేకర్స్ ఈగల్ నుంచి గల్లంతే గల్లంతే అంటూ సాగే రెండో పాటను మేకర్స్ లాంఛ్ చేశారు. రవితేజ, కావ్యథాపర్ మధ్య వచ్చే ఈ సాంగ్ ఫీల్ గుడ్ మెలోడీ ట్రాక్ తో మ్యూజిక్ లవర్స్న ఇంప్రెస్ చేసేలా సాగుతుంది. ఇప్పటికే లాంచ్ చేసిన ఇఠజీ లిరికల్ వీడియో సాంగ్ ఊరమాస్ స్టెప్పులతో సాగుతూ అభిమానులు, మూవీ లవర్స్ న ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది.
ఈగల్ నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈగల్ పోస్టర్లు, స్టైలిష్ లుక్, ట్రైలర్ అప్డేట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ ట్రైలర్ లో మాస్ మహారాజా రవితేజ స్టైల్లో సాగుతున్న మార్క్ డైలాగ్స్ అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.