29-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 29): హైదరాబాద్ బేగంపేట లోని ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న జరిగిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో.. ప్రధాన నిందితుడు సాహిల్ ను తప్పించి మరొకరిని నింది తుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడిని ఎలా తప్పించారనే విషయం తాజాగా వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన రోజున రాత్రి డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ దుర్గారావు.. ఘటనాస్థలం నుంచి సాహిల్ ను కారులో పంజాగుట్ట ఠాణాకు తీసుకొ చ్చారు.
కానిస్టేబుల్ కు అప్పగించి, పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషను బ్రీత్ అనలైజర్ పరీక్ష కోసం పంపారు. ఈక్రమంలో నిందితుడు తప్పించుకొని, అప్పటికే బయటున్న కారులో ఇంటికి వెళ్లాడు. తమ డ్రైవర్ ను తన స్థానంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పంపాడు. అతడితో ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్టు వాంగ్మూలం ఇప్పించేలా పురిగొల్పాడు. విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూశాక కూడా ఉన్నతాధికారులకు ఇన్స్పెక్టర్ అసలు విషయం చెప్పకుండా గోప్య త పాటించినట్టు తేలింది.
నిందితుడు తప్పించుకొని ముంబయికి, అక్కడి నుంచి దుబాయ్ పారిపో యేందుకు సహకరించినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. దర్యాప్తును పక్కదారి పట్టించడంలో ఇన్స్పెక్టర్ కీలకంగా వ్యవహరించినట్టు పంజాగుట్ట ఠాణా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారాలు సేకరిం చారు. ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు గుర్తించాకనే.. ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేసినట్టు స మాచారం. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు.