29-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్ 29): రెడ్ బుక్ అంశంపై సీఐడీ అధికారులు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్?కు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన రోజు నుంచి అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని అరోపించారు. అడుగడుగునా తనకు అడ్డు తగులుతున్నారని నిరననలు కూడా చేశారు. ఈ క్రమంలోనే రెడ్ బుక్ అంశం తెరపైకి వచ్చింది. తనను అడ్డుకున్న అధికారులు, నాయకుల పేర్లను రెడ్ బుక్ లో రానుకున్నట్లు తెలిపారు లోకేష్.
తమ పార్టీ వాళ్లను ఇబ్బంది పెట్టి, అసౌకర్యానికి గురి చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. దీనిపై గతంలో కొందరు అధికారులు నారా లోకేష్ పై కంప్లైంట్ చేశారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ తమను బెదిరిస్తున్నారని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు నూచనల మేరకు సీఐడీ అధికారులు లోకేష్ కు శుక్రవారం వాట్సప్ లో నోటీసులు పంపించారు.
నోటీసులు అందుకున్నట్లు సీఐడీ అధికారులకు లోకేష్ నమాధానం కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు విచారణ జనవరి 9కి వాయిదా వేసింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం. యువగళంలో ప్రజల నమన్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ కు కొందరు అధికారులు అడ్డు తగిలారని వారందరిపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులపై బెదిరింపులకు పాల్పడినందుకు సీఐడీ అధికారులు నారా లోకేష్ కు నోటీసులు అందజేశారు.