ad1
ad1
Card image cap
Tags  

  29-12-2023       RJ

పవన్ కల్యాణ్ పై జగన్ ఘాటు విమర్శలు

ఆంధ్రప్రదేశ్

అమరావతి, (డిసెంబర్ 29): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎన్ జగన్ భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచక శక్తులకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు రాష్ట్రంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పవన్ కల్యాణ్ అడ్రస్ ఉండదన్నారు. చంద్రబాబు సీఎం అయితే చాలు అని అవే వేలకోట్లు రూపాయలని భావిస్తున్నారన్నారు.

అసలు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా అనలు సీట్లు ఇవ్వకపోయినా ఒప్పుకుంటాడన్నారు. మోసాలు చేస్తూ ప్రజలను దోచుకునేవారికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అని పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తారు. ప్రజలు కోసం త్యాగాలు చేసే నాయకులు ఉంటారు. అయితే ఈ దత్తపుత్రుడు ప్యాకేజీల కోసం తనను నమ్మకున్న వారిని త్యాగం చేసే రాజు పవన్ కల్యాణ్ అని వరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఆడవాళ్లను ఆట వస్తువులుగా చూస్తూ పెళ్లి అనే వవిత్ర వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని జగన్ విమర్శించారు. నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం తిరిగి వారికి విడాకులు ఇవ్వడం మళ్ళీ మరొకర్ని పెళ్ళి చేసుకోవడం అలవాటుగా మారిందన్నారు. కార్లను మార్చినంతా నులభంగా భార్యలను మార్చుతున్నా పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రాన్ని నక్రమంగా పరిపాలిస్తారన్న నమ్మకం లేదన్నారు. ఇలాంటివారిని మనం నాయకులగా ఎన్నుకుంటే రాష్ట్రంలో ఆడపిల్లలు పరిస్థితి దారుణంగా ఉంటుందని విమర్శించారు.

సమాజంలో ఇటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితే భావితరాలు వారు వారిని స్ఫూర్తిగా తీసుకుంటే నేటి సంప్రదాయం కుటుంబం వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. ప్యాకేజీలు కోసం తమ పార్టీ కార్యకర్తలను తాకట్టు పెడుతున్న ఈ దత్తపుత్రుడు రాజకీయాలు చేయడానికి అర్హత లేదన్నారు. నాయకత్వం, విశ్వసనీయత లేని వారిని ఎన్నుకుంటే ప్రజలకు మంచి జరగదు అని సీఎం జగన్ పేర్కొన్నారు.

జగనన్న విద్యా దీవెన పథకం కింద వూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లో భాగంగా 23-2024 విద్యా సంవత్సరంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి అర్హులైన 8,09,093 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు రూపాయలను వశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రతివక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP