29-12-2023 RJ
తెలంగాణ
కోరుట్ల, (డిసెంబర్ 29): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో మండలానికి చెందిన 14 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మానిఫెస్టోలో పెట్టిన పథకాలన్నింటినీ అమలు చేయాలని కోరారు. యువవికాసం కార్యక్రమంలో నిరుద్యోగ భృతి, మహిళలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి ఆరు గ్యారంటీలలో చేర్చలేదని పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని, తరువాత ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ప్రభుత్వం రైతు బంధు, రుణమాఫీ, ఉచిత కరెంట్పై దృష్టిని సారించాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో 12 లక్షల మంది కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ది పొందారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా సభ్యులు రాంచందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కోలుముల రమణ, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేకుల పల్లి ఎత్తి పోతల పథకాన్ని పునఃప్రారంభించారు.