29-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 29): తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. నమాజంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ ఎక్కువ అయ్యాయని ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియన్ గా ఉందన్నారు. విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు డ్రగ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టమని హెచ్చరించారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. 41 శాతం కోర్టు శిక్షలు పెరిగాయని డీజీపీ పేర్కొన్నారు. 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించామన్నారు. సోషల్ మీడియా ద్వారా 1 లక్షా 38 వేల ఫిర్యాదులు అందాయన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ విజయవంతంగా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో 100, 112 కు 16 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయని . 7 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యామని డీజీపీ వెల్లడించారు.