29-12-2023 RJ
సినీ స్క్రీన్
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ 'యానిమల్'. డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ ఏడాది విడుదలైన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో యానిమల్ కూడా చోటు సంపాదించుకుంది. అయితే ఈ మూవీలోని పాటలు ఎంత బిగ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక్కొక్క సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేస్తున్న చిత్రబృందం తాజాగా మరో ఎమోషనల్ సాంగ్ను విడుదల చేసింది. భావేన్ జానే యా నా జానే అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ పాట థియేటర్ వెర్షన్లో విడుదల చేయకపోగా.. తాజాగా చిత్రయూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అనీల్ కపూర్ మీద అటాక్ జరిగిన అనంతరం ఈ పాట రాగా ఫుల్ ఎమోషనల్ గా సాగింది. భూపిందర్ బబ్బల్ ఈ పాటను రాయడంతో పాటు పాడగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.